సత్ర్పవర్తనతో మెలగాలి :ఎస్ఐ మారుతి శంకర్
1 min readపల్లెవెలుగువెబ్, మిడుతూరు: గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు, .. దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మిడుతూరు మండల ఎస్ఐ జి. మారుతి శంకర్. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఎస్సై రౌడీషీటర్లకు ఘాటుగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది.ఈకార్యక్రమంలో ఏఎస్ఐ సుబ్బయ్య, సిబ్బంది కురుమయ్య,హిమామ్సా తదితరులు ఉన్నారు.