నమ్మిన వారే నా కొడుకును నట్టేట ముంచారు
1 min read– తెలుగు దేశం నాయకులు లింగారెడ్డి, రెడ్యం
– వెంకటసుబ్బారెడ్డి సాయినాథ్ శర్మ తో నరసింహ తండ్రి ,భార్య రాజేశ్వరి కన్నీటి పర్యంతం
– ఐటీడీపీ నరసింహ మృతి పై నరసింహ తండ్రి నరసింహులు భార్య రాజేశ్వరి అనుమానం
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : నాకొడుకు ప్రమాద రీత్యా చనిపోలేదు నమ్మిన వారే నీట ముంచేసారు నాకు కడుపుకోతను మిగిల్చారు పార్టీని నమ్ముకున్నందుకు ప్రాణాలు పోయాయి. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఆని బోరున విలపిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రమాదవశాత్తు నీటిలో పడితే కుడి వైపు నుదుటి మీద గాయం ఎలా ఉందని ప్రశ్నించారు అలాగే వీపు మీద రక్తపు చారలు ఉన్నాయన్నారు. అలాగే నీటిలో నుంచి బైటికి తీయగానే నీటిని మింగినట్లయుతే శరీరాన్ని వత్తినప్పుడు నోటిలో నుంచి నీరు రావాలి గాని నోటిలో ముక్కులో చెవుల్లో రక్తం ఎందుకు వస్తోంది అని వారు వాపోయారు. అలాగే నీటిలో స్నానం చేయటానికి వెళ్ళే వాడైతే చేతికి గడియారం ఎందుకు అలాగే ఉందో చెప్పాలన్నారు అలాగే సంపు కూడ ఆరు అడుగుల ఎత్తులో ఉందని దానిని అంత పైకి ఎలా ఎక్కాడని ప్రశ్నించారు. అలాగే నీటిలో మునిగిపోతే వెంటనే పైకి తెచ్చి ఎలా పడుకోబెట్టారో చెప్పాలన్నారు . అలాగే మా భర్త ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ప్రణాళిక బద్ధంగా ఇలా చంపించేసారన్నారు అలాగే తన భర్త కు నీళ్ళు అంటేనే భయమని నీళ్లలో ఎప్పుడు దిగడని అటువంటిది ఎలా నీటి సంపులోకి స్నానానికి దిగుతాడని విలపిస్తూ నరసింహ భార్యా రాజేశ్వరి ఆవేదన పర్యంతమైంది. తమ కూమారుడు ఇటీవల తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ను కుటుంబ సమేతంగా కలిశారని అప్పుడుకూడా కొందరు తన కుమారుడిని బెదిరించారని వాపోయారు. వారు పడుతున్న ఆవేదనను గమనించిన తెలుగుదేశం నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి , అప్పటికప్పుడు జిల్లా ఎస్పీ అంబూ రాజన్న్ తో ఫోన్లో మాట్లాడి నరసింహ మృతి కేసు విషయమై అతని తండ్రి భార్యా వెలుబుచ్చు చున్న అనుమానాలకు పోలీసులు తగిన సమాధానం ఇవ్వాలని కోరారు. వారి వెంట పెద్ధచెప్పలి ఎం పి టి సి నాగరాజ ఆచారి, మాజీ సర్పంచ్ హరిత సుధాకర్ వరి కోత మిషన్ రమేష్, చీమలపెంట చిన్న నరసింహులు, మైనారిటీ నాయకులు హనీఫ్ షుకూర్, నంద్యల శ్రీనివాసులు దేశం జగన్ రెడ్డి మహారాజ్, నామాల సోదరులు నామాల రాజా, నామాల రమేష్, ఎసన్న లక్షుమయ్య సాంబ శివయ్య తదితరులు భారీ సంఖ్యలో పాల్గొని ఘనంగా నరసింహ కు నివాళులర్పించారు.