NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇళ్ల వ‌ద్ద బెల్స్, డ్ర‌మ్స్ మోగించండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పెట్రో ధరల పెంపుపై కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతోంది కాంగ్రెస్. శనివారం నాటికి కేంద్రం వరుసగా ఐదో రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎల్పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ గ్యాస్ ధరలు కూడా పెంచింది కేంద్రం. కేంద్రం ప్రజలను పెట్రో ధరల పేరుతో నిస్సిగ్గుగా దోపిడీ చేస్తోందని, దీన్ని ఆపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 7 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 31న ఉదయం పదకొండు గంటలకు ప్రజలు, కాంగ్రెస్ నేతలు తమ ఇళ్ల వద్ద, పబ్లిక్ ప్లేసులలో గ్యాస్ సిలిండర్లకు దండలు వేడయంతోపాటు, డ్రమ్స్, బెల్స్ వంటివి మోగించాలని సూచించింది. ఈ నిరసనల శబ్దాలైనా బీజేపీ చెవిన పడతాయని కాంగ్రెస్ అభిప్రాయపడింది.

                                                  

About Author