PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదలందరికి ఇళ్లు ..లబ్దిదారుల ఖాతాల్లో రూ. 2.98 కోట్లు నగదు జమ

1 min read

నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు వడ్డీ రీయింబర్స్ మెంట్ కింద  22,244 మంది..

లబ్దిదారుల ఖాతాల్లో రూ. 2.98 కోట్లు నగదు జమ..

కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ రావు,

జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరు జిల్లాలో నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు వడ్డీ రీయింబర్స్ మెంట్ కింద  22,244 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 2.98 కోట్లు నగదు జమచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు.  గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు వడ్డీ రీయింబర్స్ మెంట్ కింద లబ్దిదారుల ఖాతాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంప్యూటర్ బటన్ నొక్కి జమచేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఏలూరు కలెక్టరేట్ నుంచి జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. అదే విదంగా ఈ కార్యక్రమంలో హౌసింగ్ డైరెక్టర్ ఘంటా సంధ్య, హౌసంగ్ పిడి కె. రవికుమార్, డిఆర్డిఏ పిడి డా. ఆర్. విజయరాజు, లబ్దిదారులు పాల్గొన్నారు.  ఈ సందర్బంగా జిల్లాలోని 22,844 మంది లబ్దిదారులకు మొదటి విడత వడ్డీరాయితీగా రూ. 2.98 కోట్లు నగదు జమకు సంబంధించి లబ్దిదారులకు జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్  మెగాచెక్కును  అందజేశారు. అనంతరం  జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాకు 83 వేల 825 గృహాలు ప్రధానమంత్రి అవాస్ యోజన-వైఎస్ఆర్ బిఎల్ సి(పట్టణ) పధకంలోను 15,049 గృహములు ప్రధానమంత్రి అవాస్ యోజన-వైఎస్ఆర్(గ్రామీణ) పధకంలోను వెరశి 98,874 గృహములు రూ. 1779.93 కోట్ల ప్రాజెక్ట్ విలువతో మంజూరు కాబడిన 29080 గృహములు పూర్తి కాబడినవని తెలిపారు.  మిగిలిన గృహాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు.   ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం కోసం  రూ. 708.78 కోట్లు ఖర్చు అయిందని తెలిపారు.  జిల్లాలో మొదటి విడతగా వడ్డీరాయితీగా 22,844 మందికి రూ. 2.98 కోట్లు మంజూరు చేయబడ్డాయన్నారు. జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ సొంత గృహం లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలందరికి సొంతఇంటి స్ధలం, గృహనిర్మాణాలకు ప్రభుత్వం ఆర్ధిక చేయూతనందిస్తున్నదన్నారు. అదే విధంగా పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు.  ఇంటి నిర్మాణానికి ఇచ్చే నగదుతోపాటు స్వయంసహాయక సంఘాల్లోని సభ్యులుగా ఉన్న మహిళలందరికి ప్రభుత్వం అధనపు రుణాలను మంజూరు చేస్తున్నదన్నారు. ఆ రుణాకైన వడ్డీసొమ్మును లబ్దిదారులకు భారం కాకూడదని ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తోందన్నారు. గృహనిర్మాణ యూనిట్ విలువ 1.80 లక్షలతోపాటు స్వయం సహాయక సంఘాల ద్వారా ఒకోక్క ఇంటికి రూ. 35 వేల రూపాయలను పావలా వడ్డీతో అధనంగా స్వయంసహాయక బృందాల ద్వారా 72820 మంది లబ్దిదారులకు రూ. 256.54 కోట్లు మంజూరు చేయబడినదని తెలిపారు.కార్యక్రమంలో స్వయం సహాయక బృందాల ఇళ్ల లబ్దిదారులు పాల్గొన్నారు.

About Author