లబ్దిదారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలి
1 min readకేంద్ర కమ్యూనికేషన్‌ల శాఖ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వంద శాతం లబ్దిదారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కేంద్ర కమ్యూనికేషన్‌ల శాఖ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు.కోడుమూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్‌ల శాఖ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్‌ల శాఖ మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వంద శాతం లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నవంబర్ 25వ తేదీ నుంచి నిర్వహించడం జరుగుతోందన్నారు.. ఈ యాత్ర జనవరి 26వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీలలో జరిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు..కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మంచి లబ్ది చేకూరుతోందన్నారు..అర్హులై సంక్షేమ పథకాలు లబ్ధి పొందని వారు ఉండకూడదనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు..కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందించాలని ఆయన పేర్కొన్నారు.. గ్రామాల్లో ప్రతి ఇంటికి నీరు, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక సౌకర్యాల కల్పన తో పాటు ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరిని నమోదు చేయడానికి గాను వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని నవంబరు 25వ తేదిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని కర్నూలు జిల్లాలో ఉన్న 484 గ్రామపంచాయతీలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని అయితే ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని 149 గ్రామ పంచాయతీలలో నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయడం జరిగిందన్నారు. ఇందులో అయుష్మన్ భారత్ పథకం ద్వారా 5లక్షల వరకు వారి ఆరోగ్యరక్ష భీమాను అందజేయడం జరుగుతుందన్నారు. జన్ ఔషది దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా పేదలకు నాణ్యమైన మందులు అందజేయడం జరుగుతుందన్నారు. పిఎం ఉజ్వల యోజన పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న నిరుపేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సదుపాయం, పిఎం అవాస్ యోజన ద్వారా నిరుపేదలకు పక్క ఇళ్లు, పిఎం కిసాన్ ద్వారా రైతులకు ఎడాదికి రూ.6వేలు ఆర్థిక సహాయం, మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమం ద్వారా బాలలకు, గర్భిణీ స్త్రీలకు రోగ నిరోధక శక్తి టీకాలు, హర్ ఘర్ కి జల్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు, పోషణ అభియాన్ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పోషక ఆహారం తదితర 17 రకాల ప్రధాన సంక్షేమ పథకాల ద్వారా దేశ ప్రజల విద్యా, వైద్యం, ఆరోగ్యం, రైతు, మహిళ, బాలబాలికల సంక్షేమ సాధన దిశగా పథకాలను అమలు పరుస్తున్న ప్రక్రియను వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా కోడుమూరు గ్రామ పంచాయతీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగిందని, ముఖ్యంగా ఏదైనా పథకానికి లబ్ధి పొందడానికి అర్హత ఉండి లబ్ధి పొందని వారు ఉంటే వివిధ సంక్షేమ పథకాలు అందజేసే సంబంధిత శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని వాటిలో రిజిస్టర్ చేసుకొని సంక్షేమ పథకాల లబ్ధి పొందవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు.ఫసులున్ అనే మహిళ కేంద్ర ప్రభుత్వం నుండి తను పొందిన లబ్ధి గురించి కేంద్ర కమ్యూనికేషన్‌ల శాఖ మంత్రి కి వివరించారు.అనంతరం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వివిధ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధి పొందిన లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి లైవ్ స్క్రీనింగ్ లో ప్రసంగించారు..స్టాల్ లను సందర్శించిన కేంద్ర కమ్యూనికేషన్‌ల శాఖ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్తొలుత తపాలా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తపాలా జీవిత భీమా మరియు గ్రామీణ తపాలా జీవిత భీమా ఉత్పత్తుల స్టాల్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ఉచిత ఆరోగ్య పరీక్షలు మరియు ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ స్టాల్, ఆర్డబ్ల్యుఎస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హర్ ఘర్ జల్ – జల్ జీవన్ మిషన్ స్టాల్, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ స్టాల్, పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వమిత్వ అబడి సర్వే స్టాల్, హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి అవజ్ యోజన స్టాల్, DRDA – YKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైసెస్ స్టాల్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి కిసన్ సమ్మన్ స్టాల్, సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్టాల్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీవనజ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన స్టాల్, పశుసంవర్తక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్టాల్స్ ను పరిశీలించి ఇప్పటివరకు ఎంతమందిని రిజిస్టర్ చేశారు అనే వివరాలను అడిగి తెలుసుకొని, అర్హులై లబ్ధి పొందని వారు ఎవ్వరూ ఉండకూడదని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.. అనంతరం వికసిత భారత్ సంకల్పయాత్ర వాహనాన్ని జెండా ఉప్పి ప్రారంభించారు.కార్యక్రమం చివరిలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబందించిన క్యాలెండర్, బుక్లెట్ ను ఆవిష్కరించారు… ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైసెస్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కింద అర్హులైన 607 స్వయం సహాయక సభ్యులకు 3 కోట్ల 3 లక్ష రూపాయల చెక్కును అందజేశారు.కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర్ రెడ్డి, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, సిపిఓ హిమాప్రభాకర్ రాజు, డిపిఓ నాగరాజు నాయుడు, బిజెపి నాయకులు నీలకంఠం, డా.పార్థసారథి, విరుష రెడ్డి, ఎంపిపి రుతమ్మ, ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ చంద్రమౌళి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.