ఒమిక్రాన్ పై బెంగాల్ ముందడుగు.. లాక్ డౌన్ !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ తరహా ఆంక్షలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. స్కూల్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, వినోద పార్కులను జనవరి 3వ తేది నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి హెచ్‌కే ద్వివేదీ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో మాత్రమే కార్యకలాపాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. పాలనా పరమైన సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించుకోవాలని సూచించారు.