PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ పురస్కారాలకు.. దరఖాస్తు చేసుకోండి

1 min read

– మౌలానా అబుల్​ కలాం ఆజాద్​, డా.అబ్దుల్​ హఖ్​ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి

  • ఈ నెల 25న చివరి గడువు
  • ముస్లిం మైనార్టీ జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిహ పర్వీన్​

కర్నూలు, పల్లెవెలుగు:ఉర్దూబాష అభివృద్ధి మరియు సాహిత్య, విభిన్న విభాగాలలో అత్యత్తమ సేవలు అందించిన  వారికి నవంబరున 11న మౌలానా అబుల్​ కలాం ఆజాద్​ జయంతి  పురస్కరించుకుని మౌలానా అబుల్​ కలాం  ఆజాద్​ జాతీయ స్థాయి పురస్కారం మరియు డా. అబ్దుల్​ హఖ్​ ప్రాంతీయ స్థాయి పురస్కారం అందజేయనున్నట్లు ముస్లిం మైనార్టీ జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిహ పర్వీన్​ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.  ముస్లిం మైనార్టీల సంక్షేమ దినోత్సవం మరియు జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్న నవంబరు 11న అత్యత్తమ సేవకులకు   మౌలానా అబుల్​ కలాం ఆజాద్ పురస్కారం  (రూ.1,25,000/- ప్రోత్సాహకం, సర్టిఫికేట్ మరియు మెమెంటో) మరియు డాక్టర్ అబ్దుల్ హఖ్ ప్రాంతీయ స్థాయి పురస్కారం(రూ.1,00,000/- ప్రోత్సాహకం, సర్టిఫికేట్ మరియు మెమెంటో) అందించనున్నారు. అలాగే రాష్ట్రానికి చెందిన ఉర్దూ సాహితీవేత్తలకు, పండితులకు (స్కాలర్), కవులు, పాత్రికేయులకు, విమర్శ, పరిశోదన, గద్య బోధన మరియు ఉర్దూ సేవకులకు ఇలా వివిధ విభాగాలలో సేవలు అందించిన ఆరుగురికి ” జీవిత కాల సాఫల్య పురస్కారాలు” అందించనున్నారు. ఇదేవిదముగా ఉర్దూ భాషాభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ” ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం” మరియు ఉర్దూ భాషలో అత్యున్నత శ్రేణిలో రాణించిన విద్యార్థులకు ” ఉత్తమ విద్యార్థి పురస్కారం” కూడా అందించనున్నారని తెలియజేశారు.

25న దరఖాస్తుకు చివరి గడువు

పురస్కారముల కొరకు దరఖాస్తులను ఉర్దూ అకాడమీ ద్వారా జారి చేయబడిన దరఖాస్తు పారము పూరించి పాటశాల కు చెందిన ఉపాద్యాయులు మరియు ప్రధానోపాద్యాయులు డి.ఇ.ఓ/డిప్యుటీ ఇ.ఓ ద్వారా, ఇంటర్ మరియు డిగ్రీ కళాశాల లకు చెందిన ఉపాధ్యాయులు కళాశాల ప్రిన్సిపాల్ మరియు డి.ఇ.ని ఓ./ఆర్.ఐ.ఓ ద్వారా, విశ్వవిద్యాలయ ఉపాద్యాయులు ప్రిన్సిపాల్/రిజిస్టార్ ద్వారా ప్రమాణ ప్రతులను జతపరుస్తూ తేది: 25.10.2024 లోపల మరియు జీవిత సాఫల్య పురస్కారము కొరకు రాష్ట్రానికి చెందిన ఉర్దూ సాహితీవేత్తలు, పండితులు (స్కాలర్), కవులు, పాత్రికేయులు, విమర్శ, పరిశోదన, గద్య బోధన మరియు ఉర్దూ సేవకులు కూడా ప్రతిపాదనలను డా// మహమ్మద్ మస్తాస్, డైరెక్టర్/సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ స్టిట్ ఉర్దూ అకాడమీ, డోర్ నెం: 76-1-6A/182, మాలవికా విల్లా, హెచ్.బి. కాలని, భవానిపురం, విజయవాడ – 520012 అనే చిరునామా కు స్వయంగా లేదా పోస్టు / కొరియర్ ద్వారా పంపవలసినది కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *