NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైకెపి సీసీ కృష్ణారెడ్డికి ఉత్తమ అవార్డు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మహిళా మండల సమాఖ్య పొదుపు భవనంలో వైకెపి కమ్యూనిటీ కో ఆర్డినేటర్(సిసి)గా పని చేస్తున్న వి. కృష్ణారెడ్డికి ఉత్తమ ప్రతిభ అవార్డు లభించింది.74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రోజు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మరియు వైకెపి ప్రాజెక్టు డైరెక్టర్ వైవి శ్రీధర్ రెడ్డి ల చేతుల మీదుగా కృష్ణారెడ్డికి ఉత్తమ అవార్డు అందజేశారు.కృష్ణారెడ్డికి ఉత్తమ అవార్డు లభించినందుకు గాను శుక్రవారం రోజున మధ్యాహ్నం మిడుతూరు మహిళా మండల సమైక్య పొదుపు భవనంలో ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి, తహసిల్దార్ సిరాజుద్దీన్,ఈఓఆర్డి ఫక్రుద్దీన్, ఏవో దశరధరామయ్య,ఏరియా కోఆర్డినేటర్ డేగలయ్య,ఏపిఎం సుబ్బయ్య,సీసీలు,వివోఏలు తదితరులు ఆయనను శాలువా మరియు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

About Author