సిబ్బందికి ఉత్తమ సేవా ప్రశంసా పత్రాలు..
1 min read– జిల్లాలో ప్రతి కార్యాలయ సిబ్బంది నిష్పక్షపాతంగా పనిచేయాలి..
– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: ఏలూరు 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం అందించే పథకాలను నేరుగా ప్రజల వద్దకు చేరువయ్యే విధంగా ప్రతి కార్యాలయ సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించి ఐక్యతతో సమన్వయంతో పనిచేయాలన్నారు, దీనిలో భాగంగా స్థానిక కలెక్టరేట్ కాంపౌండ్ లో జిల్లా ఖజానా కార్యాలయ సిబ్బందికి ఉత్తమ సేవా ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా అందుకున్నారు, ఈ ప్రశంసా ప్రతాలు అందుకోవడంతో తమపై మరింత బాధ్యత పెంచిందన్నారు. తమ కార్యాలయానికి వచ్చే కక్షిదారులకు మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారికి కావలసిన సేవలు అందిస్తూ కాలయాపన లేకుండా తగినంత సమయంలో వారికి నిరంతర సేవలు అందిస్తామని ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తామని తెలిపారు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ ఏడాది జిల్లా ట్రెజరీ ఆఫీసర్ టి కృష్ణకు సీనియర్ అసిస్టెంట్స్ జయలక్ష్మి , రత్నకుమారి, మరియు సిబ్బంది ఉత్తమ సేవ ప్రశంసా పత్రలు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అందించారు, ఈ సందర్భంగా డిటి ఏవో మాట్లాడుతూ ప్రశంసా పత్రాలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని. తమ కార్యాలయ పేరు ప్రతిష్టలు మరింత గా పెంపొందించేందుకు గాను సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఏలూరు జిల్లా ట్రెజరీ ఆఫీసర్ టి కృష్ణ సిబ్బందికి సూచించారు.