అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం.. : డా. దిరిశాల వరప్రసాదరావు
1 min readపల్లె వెలుగు,ఏలూరు: స్థానిక 5వ డివిజన్ చెంచుల కాలనీలో వైద్యానికి నోచుకోని ఎక్కువ నిరుపేద కుటుంబాల వారు శాతం మంది నివసిస్తున్నారు, ఈ ఏరియా వైద్యం అనేది సాధారణ మనిషికి అందనంత దూరంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సంక్షేమమే తన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సారధ్యంలో ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ,ఎంతటి బిజీ సమయాల్లో గడిపిన కూడా పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ మా యువతకు ఆదర్శ మూర్తిగా నిలిచిన మహానుభావులు ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డా.దిరిసాల వరప్రసాద్ కి స్థానిక ప్రజలు మరియు స్థానిక కార్పొరేటర్లు ఇమ్మానుయేలు జయ యకర్, బోద్దాని అఖిల,డింపుల్ జోష్ ,కృతజ్ఞతతో సంతోషం వ్యక్తం చేశారు.ఇపుడు ఆయన బాట లోనే ఆయన ఆశయాలను అందిపుచ్చుకుని చెంచులకాలనీ లో డా.జి. మహేశ్వరి ఎం బి బి ఎస్ చేత ఏర్పాటు చేయబడ్డ మహాలక్ష్మి హాస్పిటల్ ను ఈ రోజు దిరిసాల వరప్రసాద్ చే ప్రారంభించడం జరిగినది.అన్ని సమయాలలో వైద్యం అందుబాటులో ఉంటూ ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఎల్లవేళలా సేవలు అందిస్తామని డాక్టర్ మహేశ్వరి హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షులు బోద్దాని శ్రీనివాస్, కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్రావు,స్థానిక వైసిపి నాయకులు పల్లెల గంగాభవాని,మేతర అజయ్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.