ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
1 min read– నందికొట్కూరులో జనతా హాస్పిటల్ ప్రారంభం
– ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తొగురు ఆర్థర్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. ఆదివారం నందికొట్కూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రవేట్ వైద్యశాల జనతా హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నందికొట్కూరు శాసనసభ్యులు తోగురు ఆర్థర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరికరాలతో అందరికీ అందుబాటులో ఉండేలా వైద్య సదుపాయాలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందరికీ అందుబాటులో వైద్యం ఉందన్నారు. పేద ప్రజల కోసం తక్కువ ఖర్చుతోనే వైద్య పరీక్షలన్నీ చేస్తామని చెప్పడం హర్షణీయమని నూతన హాస్పిటల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. అనంతరం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జుబేర్ అహమ్మద్ మాట్లాడుతూ. దూరప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా అత్యాధునిక టెక్నాలజీతో హాస్పిటల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు వైద్యశాలలో కూడా గ్రామ స్థాయికి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ ధనార్జన లేకుండా అందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా చేయాలన్నదే ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్ , గుండె జబ్బులకు అంత్యంత టెక్నాలజీ కలిగిన పరికరాలు హాస్పిటల్ లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రబ్బాని గ్రూప్స్ అధినేత తాటిపాడు మాబుసాహెబ్, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ జుబేర్ అహ్మద్ , చైర్మన్ డాక్టర్ జహీరాబాద్, నజీర్ అహ్మద్ సీనియర్ అడ్వకేట్, రాష్ట్ర హౌసింగ్ డైరెక్టర్స్ రమాదేవి, ఉర్డు అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ షూకురు , ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు దిలీప్ రాజు, నందికొట్కూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రబ్బాని , కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ , బ్రాహ్మణకొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు సర్వోత్తమ రెడ్డి , దామగట్ల వైసీపీ నాయకులు మాధవరం రత్నం , మహిళా నాయకురాలు డా. వనజ , పేరుమాళ్ళ జాన్ , తమ్మడపల్లి విక్టర్ , భాస్కర్, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.