గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
1 min readవైద్య విభాగాన్ని సందర్శించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి..
వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలు పరిశీలన..
గిరిజన ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదు
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్య తేజ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరులో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో గిరిజన ప్రాంత ప్రజలకు ఏర్పాటుచేసిన వైద్య విభాగాన్ని ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి సూర్య తేజ గురువారం సందర్శించి, వార్డ్ నిర్వహణ, సిబ్బంది, వైద్య పరికరాలు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో సుదూర గిరిజన ప్రాంతాల నుండి మెరుగైన వైద్య సేవలకుగాను విచ్చేసే ప్రజలకు సత్వరమే వైద్య సేవలందించేందుకు ప్రత్యేక వైద్య విభాగం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఈ ప్రత్యేక విభాగంలో మందులకు ఎటువంటి కొరత లేకుండా పూర్తి స్థాయిలో నిల్వ ఉండేలా చూడాలని, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలలన్నారు. గిరిజన ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వైద్య సేవలందించాలని ఆసుపత్రి వైద్యులను సూర్యతేజ ఈ సందర్భంగా కోరారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా శశిధర్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా. రాజీవ్, ప్రభృతులు పాల్గొన్నారు.