విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి…
1 min read– ఎం ఈ ఓ, స్టెల్లా షర్మిల రాణి
పల్లెవెలుగు , వెబ్ చెన్నూరు: అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మండల విద్యాధికారి తెల్ల స్టెల్లా షర్మిల రాణి అన్నారు, సోమవారం మండల విద్యావనరుల కేంద్రంలో నాలుగు రోజులపాటు ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అభ్యసన స్థాయిలో వెనుకబడిన 3,4,5 తరగతుల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని టీచింగ్ అట్ రైట్ లెవెల్ (taral) ప్రధమ్ ఆర్గనైజేషన్ వారిచే నిర్వహిస్తున్న కార్యక్రమని ఆమె తెలిపారు, ఈ కార్యక్రమం వెనుకబడిన విద్యార్థుల కొరకు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు, ఈ శిక్షణా కార్యక్రమం మూడు నాలుగు ఐదు తరగతులు బోధించే ఉపాధ్యాయులకు నిర్వహించబడుతుంది అని ఆమె అన్నారు, ఇందులో ఒకటవ తరగతి విద్యార్థులు అందరూ కూడా ఒకే స్థాయిలో ఉండరని, అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు ఆ విద్యార్థులందరికీ బోధన చేయవలసి ఉంటుందని ఆమె తెలిపారు, ఉపాధ్యాయులు అందరూ కూడా మీ పాఠశాలలో అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థులందరినీ గుర్తించి ఆ విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఆమె ఉపాధ్యాయులకు తెలియజేశారు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ నాలుగు రోజుల శిక్షణ లో పాల్గొని, ఇక్కడ శిక్షణలో ఏవైతే మీకు తెలియజేశారో ఈ విషయాలన్నింటినీ కూడా మీ మి పాఠశాల యందు నిర్వహించ వలసి ఉంటుందని ఆమె అన్నారు, ఈ శిక్షణలో ఉపాధ్యాయులకు ఆర్ పి లు శ్రీనివాసులు, ఖాదర్ భాష, పెంచలయ్య, వ్యవహరిస్తారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో, 3,4,5 తరగతుల ఉపాధ్యాయులు అందరు పాల్గొన్నారు.