PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి

1 min read

– ప్రధమ్ జిల్లా కోఆర్డినేటర్ మస్తాన్
పల్లెవెలుగు , వెబ్​ చెన్నూరు : అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రధమ్ జిల్లా కోఆర్డినేటర్ మస్తాన్ అన్నారు. బుధవారం మండల విద్యావనరుల కేంద్రంలో ట్రల్ పేస్11లో భాగంగా నాలుగు రోజులపాటు ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని టీచింగ్ అట్ రైట్ లెవెల్ (taral) ప్రధమ్ ఆర్గనైజేషన్ వారిచే నిర్వహిస్తున్న ఫేస్11 కార్యక్రమము అని ఆయనతెలిపారు, ఈ కార్యక్రమం వెనుకబడిన విద్యార్థుల కొరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు, ఈ శిక్షణా కార్యక్రమం మూడు నాలుగు ఐదు తరగతులు బోధించే ఉపాధ్యాయులకు నిర్వహించబడుతుంది అని ఆయన అన్నారు, ఇందులో విద్యార్థులు అందరూ కూడా ఒకే స్థాయిలో ఉండరని, అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు ఆ విద్యార్థులందరికీ బోధన చేయవలసి ఉంటుందని ఆయన తెలిపారు,అనంతరం మండల విద్యాశాఖ అధికారి స్టెల్లా షర్మిల రాణి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు అందరూ కూడా మీ పాఠశాలలో అభ్యసన స్థాయిలో వెనుకబడిన విద్యార్థులందరినీ గుర్తించి ఆ విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఆమె ఉపాధ్యాయులకు తెలియజేశారు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ నాలుగు రోజుల శిక్షణ లో పాల్గొని, ఇక్కడ శిక్షణలో ఏవైతే మీకు తెలియజేశారో ఈ విషయాలన్నింటినీ కూడా మీ మి పాఠశాల యందు నిర్వహించ వలసి ఉంటుందని ఆమె అన్నారు, ఈ శిక్షణలో ఉపాధ్యాయులకు ఆర్ పి లు శ్రీనివాసులు, ఖాదర్ భాష, పెంచలయ్య, వ్యవహరిస్తారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో, 3,4,5 తరగతుల ఉపాధ్యాయులు అందరు పాల్గొన్నారు.

About Author