హెచ్చుతగ్గుల మధ్య.. ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్
1 min read
పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్, ఆసియా, యూరప్ మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. భారత సూచీలు కూడ అదే బాటలో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఫార్మా, రియాల్టీ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు డీలాపడ్డాయి. ఉదయం మంచి లాభాలతో ప్రారంభమయ్యాక.. మధ్యాహ్నం సమయంలో వివిధ సెక్టార్లలో అమ్మకాల కారణంగా ఒత్తిడి నెలకొంది. 2:40 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 24 పాయింట్ల స్వల్ప నష్టంతో 57763 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల స్వల్ప నష్టంతో 17209 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 322 పాయింట్ల నష్టంతో 36467 వద్ద ట్రేడ్ అవుతోంది.