మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు జాగ్రత్త
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: జిల్లా ఏరువాక కేంద్రం, నంద్యాల’ప్రిన్సిపల్ సైంటిస్ట్ (సస్యరక్షణ)డా.ఏ. రామకృష్ణారావు,మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ మండలంలో మాసపేట, దేవనూరు, కడుమూరు,పీరు సాహెబ్ పేట,చింతలపల్లి గ్రామాలలో మొక్కజొన్న పంట పొలాలలో రైతులతో కలిసి వారు పర్యటించారు.మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు ఆశించి నష్టం చేస్తున్నట్లు జరుగుతుందనికత్తెర పురుగు నివారణకు గాను ఏ.రామకృష్ణారావు రైతులకు క్రింది నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.మొక్క జొన్న పంటలో కత్తెర పురుగు(ఫాల్ ఆర్మీ వార్మ్)సమగ్ర సస్య రక్షనా పద్దతులు:లింగాకర్షక బుట్టలను ఎకరానికి 10 చొప్పున అమర్చాలి. విత్తినప్పటి నుండి 25 రోజుల వరకు:5 శాతం వేప గింజల కషాయాన్ని (లేదా) అజాడిరక్టిన్ 1500 పీ.పి.యం. 5 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.విత్తిన 25 రోజు నుండి 40 రోజుల వరకు:కత్తెర పురుగు లార్వాలను నివారిరించడానికి ఒక ఎకరాకు5-20% ఆకులు దెబ్బతింటే ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రా,20% ఆకులు దెబ్బతింటేఏకరానికి:రైనాక్సిఫైర్ 100 మి.లీ,స్పైనోటరామ్ 100 మి.లీ. పిచికారి చేయాలివిత్తిన 40 రోజు నుండి 60 రోజుల లోపు:ఎకరాకు:స్పైనోసాడ్,రైనాక్సిపైర్,స్పైనోటరామ్ 100 మి.లీ,ఎమామెక్టిన్ బెంజోయేట్,థయేమిథాక్సామ్ అనే పురుగు మందులను రైతులు పిచికారి చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ సూచనలను ఆర్బికెల ద్వారా ద్వారా రైతులకు తెలియజేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులకు ఆయన తెలియజేశారు.