పాత కరెన్సీ నోట్ల ప్రకటనతో జాగ్రత్త.. ఆర్బీఐ హెచ్చరిక
1 min readపల్లెవెలుగు వెబ్ : పాత కరెన్సీ నోట్లు కొంటామని, అమ్ముతామని చేస్తున్న ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ ప్రజలను హెచ్చరించింది. మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దంటూ ఓ ప్రకటనలో ఆర్బీఐ పేర్కొంది. కొంత మంది వ్యక్తులు, సంస్థలు ఆర్బీఐ లోగోను వాడుకుని ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆర్బీఐ తెలిపింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వార పాత నోట్లు చెలామణి చేస్తూ ప్రజల నుంచి చార్జీలు, కమీషన్లు, పన్నులు వసూలు చేస్తున్నట్టు తెలిసిందని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. ఇలాంటి వాటికి ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతి లేదని, తాము ఎవరినీ ప్రతినిధులుగా నియమించలేదని ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది.