NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోసగాళ్లు ఉన్నారు జాగ్రత్త.. ఎస్​ఐ

1 min read

పల్లెవెలుగు, వెబ్ గడివేముల: అమాయకులను ఆసరా చేసుకుని మోసం చేయడం ఈమధ్య పెరిగిపోయిందని రుణమిస్తామంటూ మోసం చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని ప్రజలు అవగాహన పెంచుకోవాలని శనివారం నాడు బిలకల గూడూరు గ్రామంలో ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఫేక్ లోన్ యాప్ లో రుణం తీసుకొని అసలు కంటే వడ్డీ ఎక్కువ వసూలు చేస్తారని జాగ్రత్తగా ఉండాలని రహదారి భద్రత నియమాలు పాటిస్తూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలన్నారు గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడే వ్యక్తులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు గ్రామాలలో దొంగతనాలు జరగకుండా స్థానికంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తవారు గ్రామాలలో అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సామరస్యంగా ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని గొడవలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ప్రశాంతంగా జీవించాలన్నారు ఎవరైనా శాంతి భద్రతలను ఉల్లంఘిస్తే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సై పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు,

About Author