భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమిద్దాం
1 min read
దోపిడీ లేని సమాజం కోసం..
పత్తికొండ, న్యూస్ నేడు: పరాయిపాలన నుండి భారతదేశ విముక్తి కోసం యుక్త వయసులోనే ప్రాణాలు త్రుణపాయంగా దేశ విముక్తి కోసం ప్రాణాలను ఇచ్చిన అమరులు సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు , సుఖదేవ్ ల త్యాగాల స్ఫూర్తితో సమ సమాజం కోసం దోపిడీ లేని కులమత రహిత సమాజం కోసం పాటుపడదామని, సమాజాన్ని ముందుకు తీసుకుపోయే యువత ఐక్యం కావాల్సిన అవసరం ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్ డివైఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు సిఐటియు మండల కార్యదర్శి అశోక్ లు పేర్కొన్నారు. ఆదివారం నాడు సర్దార్ భగత్ సింగ్ ,రాజ్ గురు సుఖదేవ్ ల 94వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక సిఐటియు కార్యాలయం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆ సంఘం పట్టణ నాయకులు నాయకులు నాగేంద్ర,పెద్దయ్య ల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరుల చిత్రపటాలకు పూలమాలలను వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమరుల స్ఫూర్తితో సమ సమాజం కోసం కృషి చేద్దామని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు బలరాముడు, రాముడు, రవి, లాలు, తిప్పన్న, హేమంత్, రవితేజ, బండ్లయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.