భగత్ సింగ్ కు ఘన నివాళి: AIDYO
1 min read
కర్నూలు: భగత్ సింగ్ కలలు కన్న సమాజాన్ని నిర్మించేందుకై విద్యార్థులు, యువతీ యువకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు AIDYO రాష్ట్ర ఇంచార్జీ డి. రాఘవేంద్ర . ఆదివారం స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా నగరంలో ఏఐడీవైఓ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ కాలంలో భగత్ సింగ్ దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను స్పష్టంగా అర్థం చేసుకోవడమేకాక భవిష్యత్తులో ఏర్పడవలసిన వ్యవస్థ గురించి స్పష్టమైన అవగాహనకు వచ్చారని తెలిపారు. “ఇంక్విలాబ్ జిందాబాద్” అనే నినాదాన్ని మొట్టమొదటగా లేవనెత్తి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి దోపిడీ చేయడానికి సాధ్యంకాని స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చె విప్లవం ఏదైతే ఉందో అట్టి విప్లవ సందేశాన్ని, చైత్యన్యాన్ని, స్పూర్తిని, విప్లవ కాంక్షను దేశ ప్రజల్లో రగిల్చిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. అనంతరం AIDSO రాష్ట్ర అధ్యక్షులు వి. హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో AIMSS రాష్ట్ర కార్యదర్శి ఎం.తేజోవతి, రోజా, AIDSO నాయకులు మల్లేష్, భార్గవ్, AIDYO సభ్యులు గణేష్, మహేంద్ర, ఖాదర్, అఖిల్, విశ్వనాథ్, నాగన్న విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.