NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి…

1 min read

– యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలి…ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున..

పల్లెవెలుగు వెబ్ హోలగుంద : మండలంలోని ఇంగలదహల్ గ్రామంలో స్వాతంత్ర్య ఉద్యమ కారుడు షాహిద్ భగత్ సింగ్ 116వ జయంతి వేడుకలు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ఢిల్లీ వీధిలో ఎర్రకాగితాలు చల్లిప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనేనినాదాన్ని ఇచ్చిం ది కూడా భగత్ సింగే. భారతస్వాతంత్ర్యో ద్య మం లో పోరాడిన అత్యం తప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు. ఈకారణంగానే షహీద్ భగత్ సింగ్ గాకొనియాడబడుతున్నాడు.భగత్ అనే పదానికి”భక్తుడు” అని అర్థం . సింగ్ దేశభక్త సిక్కుకుటుంబంలోని కొం దరు భారతస్వాతంత్ర్యో ద్య మాల్లోనూ, మరికొం దరు మహారాజారంజిత్ సింగ్ సైన్యం లోనూ పనిచేశారు.భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్న ప్పు డు అతనితండ్రిభగత్ సింగ్ నీ తీసుకొని కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళా డు. అక్కడ భగత్సింగ్ పొలం లో దిగి ఆడుకుంటూనే చిన్న చిన్నగడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు.”ఏం చేస్తున్నా వ్ నాన్నా ?” అని అడిగాడు తండ్రి.భగత్ సింగ్: “తుపాకులు నాటుతున్నా “”చెట్టుపెరిగి, తుపాకులు కాస్తాయి” అని సమాధానంఇచ్చా డుభవిష్య త్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసేవయస్సు లో తుపాకు లను మొలకెత్తిం చాలనిచూడడం అతని వ్య క్తిత్వా క్తినికి మచ్చు తునక.ఆయన చివరికి ఉరితీసే సమయంలో కూడా ఉరికంభాన్ని నవ్వుతూ ముద్దాడిన వ్యక్తి అతి చిన్న వయస్సు 23 సంవత్సరాల వయసుకె ఉరికంభాన్ని ముద్దాడిన వీరుడు భగత్ సింగ్ యువత అంత భగత్ సింగ్ దారిలో నడవాలని కోరారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పంపాపతి,జాన్,మునిర్, శివకుమార్,ముసాయబ్ పాల్గొన్నారు.

About Author