భగత్ సింగ్ జీవితం నేటి యువతకు ఆదర్శం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: భగత్ సింగ్,రాజ్ గురు,సుకుదేవ్ ల 92 వ వర్ధంతిని నందికొట్కూరు పట్టణంలో ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఐసా డివిజన్ కార్యదర్శి రంగస్వామి మాట్లాడుతూభగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28 జన్మించారని అప్పటికే ఆయన కుటుంబం స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనెవారని భగత్ సింగ్ కూడా కుటుంబ సభ్యుల అడుగుజాడలో నడిచి బ్రిటిష్ పాలన నుంచి భరతమాత దాస్యపు సంకెళ్లు తెచ్చేందుకు ప్రాణాలను అర్పించిన వీర యోధుడని ఆయన జీవితం దేశానికే అంకితం అంటూ ఉరితాడును ముద్దాడిన ధీశాలని కొనియాడారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన అనితర సాధ్యమైన పోరాట పటిమ చూస్తే భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుందని ఆయన ఆలోచనలు, ఆశయాలు, ఆవేశం లక్షలాది మంది యువతకు స్పూర్తిదాయకమని భారత స్వాతంత్ర్య విముక్తి పోరాటంలో ఆయన చేసిన సాహసం అనితర సాధ్యమని,23 ఏండ్లకే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు భగత్ సింగ్ అన్నారు. 1931 మార్చి 23న రాత్రి 7.30 గంటలకి భగత్ సింగ్‌తో పాటు సహచర విప్లవకారులు సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్‌వాలా జైల్లో బ్రిటీష్ పాలకులు ఉరి తీశారని తెలిపారు. ఉరి కంబం ఎదురుగా కనిపిస్తున్నా అధైర్య పడకుండా చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకుని దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. అందుకే ఆ రోజును ‘షహీదీ దివాస్ ‘గా జరుపుకుంటున్నామన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు హనీఫ్, బిస్మిల్లా, రాజు తదితరులు పాల్గొన్నారు.