పాఠ్యాంశంగా భగవద్గీత.. !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్ణాటక ప్రభుత్వం కూడా పాఠశాలల్లో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. స్కూల్ సిలబస్‌లో భగవద్గీతను చేర్చుతున్నట్టు గురువారం గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కర్ణాటక కూడా ఇదే విషయమై ఆలోచిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రాథమిక, సెకండరీ విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ తెలిపారు. నిపుణులతో మాట్లాడిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. నైతిక శాస్త్రాన్ని మూడు నాలుగు దశల్లో ప్రవేశపెట్టాలని, తొలి దశలో భగవద్గీతను పరిచయం చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆ విషయం ఈ రోజే తన దృష్టికి వచ్చిందన్నారు. నైతిక శాస్త్రాన్ని బోధించే విషయమై ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో చర్చిస్తామని మంత్రి విలేకరులకు చెప్పారు.