వైభవంగా భగవద్గీత చాలీసా పుస్తకావిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్: శ్రీమద్భగవద్గీత 18 అధ్యాయాలలో నుండి ముఖ్యమైన శ్లోకాలతో కూడిన భగవద్గీత చాలీసా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కర్నూల్ నగరంలోని 30 పాఠశాలకు చెందిన 600 మంది విద్యార్థులతో గీతా జయంతి సందర్భంగా సామూహిక భగవద్గీత చాలీసా ను ఏక కంఠంతో ఆలపించారు.ముఖ్య అతిథిగా హాజరైన విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ మహాభారత యుద్దాన్ని ఆలంబనగా చేసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత బోధనలతో సంపూర్ణ మానవ జీవన విధానాన్ని ఆవిష్కరించాడనీ,భగవద్గీతే లేకపోతే మానవు తన జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసుకునే వాడనీ,భగవధ్గీతలోని 18 అధ్యాయాలలో నుండి కనీసం రోజూ ఒక శ్లోకాన్ని తాత్పర్యసహితంగా పారాయణం చేసి,తన జీవనంలో ఆవిధాన్ని అవలంబిస్తే ఆ మనిషి మహోన్నతుడౌతాడనీ అన్నారు. మరో ఆత్మీయ అతిథి విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ మాట్లాడుతూ శ్రీమద్ భగవద్గీత ను మించిన గొప్ప మానసిక శాస్త్రం ఎక్కడ ఉండదని ఎవరైతే తమ మనస్సును నిగ్రహించుకుంటారు వారికి మనసు మిత్రుడు గా ఉంటుంది నియంత్రించలేని మనసు శత్రువు అవుతుంది అన్నారు వివిధ పాఠశాలల పిల్లలు కుల,మత బేధం లేకుండా ఎంతో శ్రద్ధతో నేర్చుకుని ఇక్కడకు పోటీకి వచ్చారు,కానీ ఈ రోజు మీరు నేర్చుకున్న ఈ భగవద్గీత శ్లోకాలనూ దాని తాత్పర్యాన్ని మరువక మీ రాబోయే జీవితాలకు అన్వయించుకోవాలనీ అప్పుడే మీరు నేర్చుకున్నదానికి సార్థకత చేకూరుతుందనీ హాజరైన పిల్లలను ఉద్దేశించి అన్నారు. విజ్ఞాన పీఠం కార్యదర్శి విశ్వహిందూపరిషత్ సేవా కన్వీనర్ పి.పి.గురుమూర్తి మాట్లాడుతూ శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఉపనిషత్తులు ఏదో ఒక వ్యక్తి రాసినవి కావు ,అనేకమంది ఋషులు వివిధ ప్రాంతాల్లో తపస్సు చేసి గ్రహించిన సత్యాలు అని అర్థం ఇక్కడి పోటీలో పాల్గొనడానికి వచ్చిన పాఠశాలల యాజమాన్యాలు,ఉపాధ్యాయులూ తమ తమ పాఠశాలలో నిరంతరం ఈ భగవద్గీతా జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించాలని కోరారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్బయ్య రవీంద్ర పాఠశాల వ్యవస్థాపకులు సుబ్బయ్యను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి ప్రాణేష్,ఉపాధ్యక్షులు మాళిగి వ్యాసరాజ్ ,కోశాధికారి సందడి మహేష్,ధర్మప్రసార్ కన్వీనర్ అనంత విశ్వప్రసాద్ విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,జిల్లా సంఘటనా మంత్రి వడ్ల భూపాలాచారి నగర అధ్యక్షులు టీ.సి.మద్దిలేటి,సేవా ప్రముఖ్ శేఖర్ గుప్త,నగర మాతృ శక్తి కన్వీనర్ శ్రీమతి భార్గవి,రామాలయ ప్రఖంఢ ఉపాధ్యక్షులు శ్రీమతి అరుణ,కార్యదర్శి గూడూరు గిరిబాబు,మరియూ విజ్ఞాన పీఠం అధ్యాపకులు రామిరెడ్డి,చంద్రమోహన్,రణధీర్ రెడ్డి,సుబ్రహ్మణ్యం,తదితరులు పాల్గొన్నారు.