NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సకల సౌక్యములకు భగవదారాధనే తారకమంత్రం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : మనసును నిర్మలం చేసి శాంతిని, సమస్తమైన సుఖాన్ని కలిగించేది భగవన్నామస్మరణ మాత్రమేనని ఎన్.వరలక్ష్మీదేవమ్మ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు లోని శ్రీ లలిత సుందరేశ్వర స్వామి దేవస్థానం నందు ఏర్పాటుచేసిన కార్తికమాస ధార్మిక సప్తాహ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు అజామిళోపాఖ్యానంపై ప్రసంగించారు. ప్రపంచానికి మన దేశం సమస్తమైన విజ్ఞానంతో పాటు ఎన్నెన్నో ధార్మిక విలువలు నేర్పిందని, బిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించ గలిగే శక్తి ఒక్క భారతీయ తాత్విక చింతనకే ఉందని అన్నారు. తదనంతరం శ్రీ లలిత సుందరేశ్వర స్వామివారికి ఊంజల్ సేవ ,సామూహిక దీపోత్సవ కార్యక్రమం, భక్తులందరికీ మహా ప్రసాద వితరణ జరిగింది.ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి , లలితా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author