భగవాన్ శ్రీ బాలసాయిబాబా జయంతికి.. ఏర్పాట్లు సిద్ధం
1 min readభగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్ టి. రామారావు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు నగరంలో తుంగాతీరంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ షిరిడిసాయిబాబా దేవాలయం పక్కనున్న భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆశ్రమంలో భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారి 62వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్ టి. రామారావు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీ బాలసాయిబాబా జీవించి ఉన్నప్పటి నుంచి పేదలకు నిత్యం సేవ చేస్తూనే ఉన్నామన్నారు. ఈనెల 14న (శనివారం) 62వ జయంతి సందర్భంగా చిరువ్యాపారులకు తోపుడు బండ్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పేద మహిళలకు కుట్టుమిషన్లు అందజేయడం పంపిణీ చేస్తున్నామన్నారు. అంతేకాక ఉచిత మెడికల్ క్యాంపు, అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
బాలసాయిబాబా దీనజనసేవ..
శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ చక్రం, బాలసాయిబాబా అర్చన,అభిషేకం, భజన,
9 గంటలకు మెగా మెడికల్ క్యాంపు, అమ్మ, ఆర్కా, ఓమిని హాస్పిటల్ వారిచే వైద్య పరీక్షలు , మందులు ఉచితంగా ఇవ్వబడును
10 గంటలకు జ్యోతి ప్రజ్వలన, ప్రపంచ శాంతి సదస్సు
మధ్యాహ్నం 1 గంటకు ప్రసాద వితరణ మరియు మధ్యాహ్న భోజనం
సాయంత్రం 6 గంటలకు బాలసాయి నామ సంకీర్తన ప్రముఖ కళాకారులతో.. కార్యక్రమం ఉంటుందని ఈ సందర్భంగా భగవాన్ శ్రీ బాలసాయి సెంట్రల్ ట్రస్ట్ చైర్మన్ టి. రామారావు వివరించారు.