NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తకనకదాసు.. అడుగు జాడలో నడుద్దాం..

1 min read

మాదాసి కురువ గౌరవాధ్యక్షుడు ఎల్​.సోమలింగం

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ: కురువల ఆరాధ్యదైవం భక్త కనకదాసు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని మాదాసి కురువ గౌరవ అధ్యక్షులు కె ఎల్ సోమలింగం హోసూరు  హనుమన్న అన్నారు.  కనకదాసు జయంతి పురస్కరించుకొని మండల పరిధిలోని హోసూరు గ్రామ లో  కనకదాసు చిత్రపటానికి పూలమాలవేసి గొరవయ్యల  నృత్యం తో  గ్రామ పురవీధుల్లోఊరేగింపు  అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం సోమలింగం మాట్లాడుతూ భక్త కనకదాసు లాంటి వారు  నడయాడిన  నేలపై జీవించడం సుకృత మనారు .

ప్రతి ఒక్కరు చదవాలని ప్రతి ఒక్కరిని చదివించాలని నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కురవ అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మాదాసి మదారి కురువ ఎస్సి కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాసి మారెళ్ళ లక్ష్మన్న, భాస్కర్, నాగేంద్ర, మైలార్, నరసింహుడు, అధిక సంఖ్యలో మాదాసి కురువ కులస్తులకు కలిసి పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు.

About Author