భక్తి బ్రతుకును భగవన్మయం చేస్తుంది
1 min read– డాక్టర్ మల్లు వేంకటరెడ్డి , తితిదే
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భగవంతుని మీద పెంచుకున్న భక్తివలన భక్తుడు కూడా తాదాత్మ్యం చెంది భగవంతునితో సమానం అవుతాడని, అప్పుడు భగవంతునికి భక్తునికి అభేద స్థితి ఏర్పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామంలోని శ్రీ లక్ష్మీ మాధవస్వామి దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గోపూజ కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు భక్తితత్త్వంపై ప్రవచించారు.గత మూడు రోజులుగా జరుగుతున్న భజన కార్యక్రమాలు, మూడు రోజులపాటు లలితా పీఠం పీఠాధిపతులు శ్రీగురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలు సర్వేశ్వరమ్మ, కోరుకొండ వీరభద్రుడు, అర్చకులు గోవిందయ్య, పి.సురేశ్, యు.శేషులు, కర్లకుంట తిమ్మయ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.