PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భలే రామస్వామి సన్నిధిలో… ఎమ్మెల్యే, ఎంపీ

1 min read

స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ..

తొలి రోజు 50వేల మందికి అన్న ప్రసాద వితరణ..

పల్లెవెలుగు వెబ్​: ఏలూరుజిల్లా ముసునూరు మండలంలో హర హర మహాదేవ   శంభో శంఖరా  అంటూ భక్తుల శివనామ స్మరణతో ముసునూరు, పెదవేగి మండలాల మధ్యలో ఉన్న బలివే రామలింగేశ్వర స్వామి ఆలయం శని వారం  మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దెందులూరు శాసన సభ్యులు కొటారు అబ్బయ్యచౌదరి.   రాజ్య సభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ తో కలిసి బలివే రామస్వామిని దర్శించి పూజలు చేశారు.  ఎన్నో ఏళ్లకు అరుదుగా శనివారం  శని త్రయోదశి కలయికతో రెండూ ఒకేసారి రావడం అదేరోజు మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడం భక్తుల పాలిట అరుదైన వరంగా మారింది.దీంతో భక్తులు శని వారం బలివే రామలింగేశ్వర స్వామిని దర్శించడానికి లక్షల్లో తరలి వచ్చారు.బలివే అంతా భక్తులతో శనివారం కిట కిటలాడింది. భక్తుల రద్దీతో ట్రాఫిక్కు విపరీతమైన అంతరాయం కలిగింది. ఒక దశలో పోలీసులు కూడా నివారించడానికి కష్టమైంది.  తమ్మిలేరులో  ఈరోజు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దెందులూరు ఎమ్మెల్యే  కొఠారు అబ్బయ్య చౌదరి బలివే ఉత్సవాలకు వచ్చిన 30 వేల మంది భక్తుల కు అల్పాహార విందు కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా ఎం ఎల్ ఏ అబ్బయ్యచౌదరి చేతులమీదుగా భక్తులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఆలయ కార్య నిర్వహకులు చలువ పందిళ్లు, విద్యుత్ కాంతులు, పారిశుద్ధ్య ఏర్పాట్లు, మెడికల్ క్యాంపులు, పోలీస్ బందోబస్తు  ప్రతిష్టమైనటి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ ఏ తో పాటు ఏలూరు ఎంపీపీ పెన్మచ్చ శ్రీనివాసరాజు, దెందులూరు నియోజక వర్గ స్థాయి ప్రజాప్రతినిధులు పాల్గొని భక్తులకు సేవలందించారు. కార్యక్రమంలో కార్య నిర్వహణ అధికారి తల్లాప్రగడ విశ్వేశ్వరరావు, సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, అధ్యక్షులు నాగేశ్వరరావు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలవకుండా పర్యవేక్షించగా మరియు ఆలయ ధర్మకర్తల మండలి కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.

About Author