నందికొట్కూరులో ‘ భారత్ బంద్’ ప్రశాంతం..
1 min readపల్లెవెలుగు. నందికొట్కూరు : ప్రజావ్యతిరేక విధానాలతో దేశాన్ని పరాధీనం చేయతలపోస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం,సీపీఐ, తెలుగుదేశం,సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ, అఖిల భారత రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. రైతు సాగు చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ, వామపక్షాలు, వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలో భారత్ బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైన పార్టీలు పట్టణంలోని ప్రధాన రహదారిపై పటేల్ కూడలిలో ఆందోళన చేపట్టాయి .
ఈ సందర్భంగా వామపక్షా,ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి రఘురాం మూర్తి,తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పలుచాని మహేష్ రెడ్డి,సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు,రైతు సంఘం నాయకులు రాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు అరుణ్ కుమార్, లు మాట్లాడుతూ బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా ప్రజావ్యతిరేకతను ఢిల్లీకి తెలియజేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం తక్షణ అవసరమన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, నల్లచట్టాలతో రైతులను అణగదొక్కే యత్నాలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. ప్రజలు పోరాడి సాధించుకున్న పరిశ్రమలను ప్రైవేటీకరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ , నిత్యావసర ధరలు పెరుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు రమేష్ బాబు, పక్కీర్ సాహెబ్, గోపాలకృష్ణ,మజీద్ మియ్య, వేణు,నరసింహా రెడ్డి, కళాకర్,గోపాల్, ,ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యదర్శి మూర్తుజావలి,విద్యార్థి సంఘం నాయకులు రంగస్వామి, అది,షాకీర్,గణేష్ ,మహిళా సంఘం నాయకులు నూర్జహాన్ బి, జయ,రజిత,బీబీ,మద్దమ్మ,రైతులు,కార్మిక సంఘాల ప్రజలు పాల్గొన్నారు.