NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భ‌ర‌త్ వైకాపాను నాశ‌నం చేస్తున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: త‌మ పార్టీలోని ఓ నాయ‌కుడు టీడీపీ నేత‌ల‌తో కుమ్మక్కై త‌న పై బుర‌ద జ‌ల్లే కార్యక్రమం పెట్టుకున్నార‌ని తూర్పుగోదావ‌రి జిల్లా రాజాన‌గ‌రం ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా ఆరోపించారు. పార్టీకి న‌ష్టం క‌లిగించిన‌ వారిని.. కేసులు ఉన్నవారిని దూరంపెడితే వారిని పార్టీలోకి చేర్చుకుని అల‌జ‌డి సృష్టించే ప్రయ‌త్నాలు చేస్తున్నారని విమ‌ర్శించారు. దీని వ‌ల్ల పార్టీకి న‌ష్టం క‌లిగే ప‌రిస్థితులు ఏర్పడుతున్నాయ‌ని రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ ను ఉద్దేశించి జ‌క్కంపూడి రాజా విమ‌ర్శలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధ‌ర్నాలు, ఆందోళ‌న చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని స‌స్పెండ్ చేస్తే.. అత‌ని వ‌త్తాసు ప‌ల‌క‌డం స‌రికాద‌న్నారు.

About Author