భారతి సిమెంట్స్… దాతృత్వం..
1 min read– రూ.22 లక్షల విలువ చేసే .. 22 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వితరణ
– ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్ సి. హరికిరణ్
పల్లెవెలుగు వెబ్, కడప: కరోన నియంత్రణలో భాగంగా దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని కలెక్టర్ సి. హరికిరణ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబరులో భారతి సిమెంట్స్ ప్రతినిధులు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాయి రమేష్, హెచ్ ఆర్ చీఫ్ మేనేజర్లు భార్గవ్ రెడ్డి, రవీంద్ర కుమార్ రూ. 22 లక్షలు విలువ చేసే 22 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, శాసనసభ్యులు పి.రవీంద్రనాథ్ రెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి సమక్షంలో కలెక్టర్ సి. హరికిరణ్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ… వైఎస్ఆర్ జిల్లాలో కోవిడ్ రెండవదశను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారతీ సిమెంట్స్ పరిశ్రమ వారు ముందుకు వచ్చి ఇప్పటికే స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో రూ.60లక్షల ఖర్చుతో ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం చేపట్టారని, మళ్లీ నిమిషానికి ఐదు లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినవి ఒక్కొక్క రూ. లక్ష విలువ చేసే 22 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వితరణ చేయడం ప్రశంసనీయమన్నారు భారతీ సిమెంట్స్ పరిశ్రమ తరపున ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను అందించడంలో ముఖ్య భాగస్వామ్యం వహించిన సీఈఓ సక్సేనా, డైరెక్టర్ జె.జె.రెడ్డి లను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా మన్నారు. కరోన నియంత్రణకు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సి. హరికిరణ్ కోరారు.