ఘనంగా ప్రారంభమైన భాషోత్సవాలు
1 min read
పల్లెవెలుగు, పత్తికొండ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు”స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం భాషోత్సవాలను “ఘనంగా ప్రారంభించారు. ఈ ఉత్సవాలు 18.2 .2025 నుండి 21 .2.25 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఆంగ్లభాషో త్సవాన్ని నిర్వహించారు. ఆంగ్ల ఉపాధ్యాయినీలు సరస్వతమ్మ, రాధ, సునీత మరియు రంగమ్మ పాఠశాలలో విద్యార్థినుల చేత వివిధ ఆంగ్ల భాషా కృత్యాలను ప్రదర్శింపజేశారు.” రోల్ ప్లే “కన్వర్జేషన్ “స్కిట్ మరియు ఇతర కృత్యాలను ప్రదర్శింప చేసారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒకే భాషనే నేర్చుకోవడమే కాక అనేక ఇతర భాషలలో నైపుణ్యాలను పెంచుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా జీవించవచ్చు అన్నారు. కాబట్టి విద్యార్థులు ఇతర భాషలలో కూడా పాఠశాల స్థాయిలోనే నైపుణ్యాలను నేర్చుకుంటే వారి భవిష్యత్తుకు బంగారు బాట అవుతుందని అన్నారు .పాఠశాలలో బుక్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి వారిలో చదివే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు రుక్మినమ్మ ,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.