PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా భవ్యశ్రీ జన్మదిన వేడుకలు

1 min read

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కూనా ఈశ్వర్ రెడ్డి..

పల్లెవెలుగు వెబ్ వల్లూరు : సేవా దృక్పథం కలిగిన శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్ రాగ బ్రహ్మయ్య చంద్రకళ ల కుమార్తె జన్మదినం సందర్భంగా మండల పరిధిలోని బీచువారిపల్లి గ్రామంలో ఘనంగా భవ్యశ్రీ జన్మదిన వేడుకలను నిర్వహించారు, భవ్యశ్రీ జన్మదిన వేడుకలకు గ్రామస్తుల తో పాటు ముఖ్యఅతులుగా పాల్గొన్న శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన ఈశ్వర్ రెడ్డి ఆయన సతీమణి వేంకట లక్ష్మి దేవి, ట్రస్ట్ మెంబెర్ ముచ్చుమరి సుశీల లు, కేక్ కటింగ్ చేసిన భవ్యశ్రీ ని అందరూ ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి తండ్రి దీవెన ఆశీస్సులతో చక్కగా చదివి గొప్పగా ఎదగాలని ఆశీర్వదించారు, పుట్టుక దేవుడిచ్చిన వరం అయితే, పుట్టినరోజు నాడు వేడుకలు జరుపుతూ చక్కటి పద్ధతులు నేర్పించడం తల్లి తండ్రి ల బాధ్యత అన్నారు, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవ్యశ్రీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటూ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పెట్టాలని ఆ దేవుని కోరుకుంటున్నామన్నారు.

About Author