NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండల వ్యాప్తంగా భేటీ బచావో భేటీ పడావో

1 min read

– అంగన్వాడి కార్యకర్తలు ర్యాలీలు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ఈనెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా చెన్నూరు మండలం వ్యాప్తంగా అన్ని అంగన్వాడి కేంద్రాల పరిధిలో ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం మండల కేంద్రమైన చెన్నూరు నాగలకట్ట వీధి. పరమట వీధి. అంగన్వాడి కేంద్రాల పరిధిలో ర్యాలీ నిర్వహించారు. బ్యానర్లు చేత పట్టుకొని ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం, గృహహింస నుండి మహిళలను రక్షిద్దాం అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారుల తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చెన్నూరు గ్రామ సచివాలయ మహిళా పోలీసులు. ఉమామహేశ్వరి. చంద్రకళ. వాసవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందని ఇది మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ర్యాలీలు అవగాహన కార్యక్రమంలో ఐ సి డి ఎస్ సూపర్వైజర్లు నాగరత్నమ్మ. గుర్రమ్మ. అంగన్వాడి కార్యకర్తలు పి పద్మావతి. సి రాధా. తులసి. పద్మ. ఇందిరా. మాధవి. నాగరత్నమ్మ. ఏఎన్ఎం. రెడ్డమ్మ. ఆశ వర్కర్ రాజేశ్వరి పలువురు అంగన్వాడీ కార్యకర్తలు ఆశ వర్కర్లు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author