NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సీ వర్గీకరణ భిల్లు ప్రవేశ పెట్టాలి

1 min read

– ఏపిఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ
పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి: ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఏపిఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు.ఏపిఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి రెవెన్యూ సిబ్బందికి వినతి పత్రం అందజేసారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాలలో ఏపి లోని ఉషామెహ్రా కమీషన్‌ నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ భిల్లు ప్రవేశ పెట్టాలని వారు డిమాండ్‌ చేసారు.ఈ పార్లమెంట్‌ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ భిల్లు ప్రవేశ పెట్టకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమం లో డప్పు,చర్మ కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం,మండల ఏపిఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు చిన్నఓబులేసు,నాయకులు విజయకుమార్‌,పాములేటి,నడిపి ఓబులేసు,ఓబయ్య,తదితరులు పాల్గొన్నారు.

About Author