జాతీయ సదస్సులో మెరిసిన భీమడోలు గ్రామ పంచాయతీ..
1 min readతిరుపతిలో జరిగిన జాతీయ వర్కుషాపు
ఆరోగ్య వంతమైన గ్రామ పంచాయతీ సేవలను వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్..
ఉత్తమ సేవలు అందించిన భీమడోలు సర్పంచ్ సునీత మాన్ సింగ్ కు ఘానా సన్మానం
పాల్గొన్న కార్యదర్శి ఎన్ ఠాగూర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : తిరుపతిలో జరిగిన పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి జాతీయ వర్కుషాపులో భీమడోలు గ్రామ పంచాయతీ పారిశుధ్యం పరిశుభ్రత త్రాగునీరు.రహదారుల కల్పన వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించి ఆంద్రప్రదేశ్ లో అగ్రగామిగా నిలిచి ఒక ఆణిముత్యంగా మెరిసింది. తిరుపతి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన మూడు రోజుల సదస్సులో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ బృందం ఆరోగ్య వంతమైన గ్రామ పంచాయతీ అంశంపై చేసిన వీడియో ప్రజెంటేషన్ పై వర్క్ షాపులో పాల్గొన్న దెలిగేట్స్ నుండి ప్రశంసలు అందుకుంది. పంచాయతీ రాజ్ కమీషనర్ సూర్య కుమారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు జిల్లాలో హెల్దీ విలేజ్ (ఆరోగ్యవంతమైన గ్రామం) అనే అంశంపై ప్రజా ఆరోగ్య విషయంలో భీమడోలు గ్రామ పంచాయతీ సర్పంచ్ సునీత మాన్ సింగు చేస్తున్న కార్యక్రమాల ను వివరిస్తూ డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ బృందం ఆదర్శ వంతమైన లఘు చిత్రం తయారు చేసి తిరుపతి జాతీయ వర్కుషాపులో ప్రదర్శించి అందరు ప్రశంసలు అందుకున్నారు. సదస్సులో దేశం నలుమూలల నుంచి వచ్చిన డెలిగేట్స్, అధికారులు, సర్పంచులు వారి రాష్ట్రాలలో ఉన్న గ్రామ పంచాయతీలలో ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై అమలు చేస్తున్న క్రియాశీలక కార్యాచరణ ప్రణాళికల పై చర్చించారు. ప్రజా ఆరోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, జగనన్న ఆరోగ్య సురక్ష, పేదలందరికి ఉచిత వైద్యం పారిశుధ్య ప్రమాణాలతో విద్యుత్ సదుపాయం.రహదారులు.డ్రైనేజీ.త్రాగునీరు.వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి అధునాతన మైన గృహ నిర్మాణాలు నిర్మిస్తున్న విషయాలను సదస్సులో డి పి ఓ విశ్వనాధ్ వివరించారు. భీమడోలు గ్రామ పంచాయతీ హెల్దీ విలేజ్ వీడియో ప్రదర్శన ద్వారా వైద్యరంగంలో ప్రభుత్వ అమలు చేస్తున్న విధానాలను డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ బృందం సదస్సులో ప్రదర్శించి చూపించారు. గ్రామ పంచాయతీ ల ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న జిల్లాకు చెందిన భీమడోలు సర్పంచ్ పాముల సునీత మాన్ సింగును పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా రాజశేఖర్,పంచాయతీ రాజ్ కమీషనర్ సూర్యకుమారి, హాజరైన డెలిగేట్స్ సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కమ్యూనికేబుల్ & నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు నివారణకు గ్రామ పంచాయతీ తీసుకోవలిసిన చర్యలుపై సదస్సులో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ అందర్నీ ఆకట్టుకొని ప్రశంసలు అందుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న మూడు రోజుల సదస్సులో మొదటి రోజు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు కపిల్ మొరేశ్వర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు బూడి ముత్యాల నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిగా, రెండవ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ డా కే. జవహర్ రెడ్డి పాల్గొని గ్రామ పంచాయతీల ద్వారా ప్రజలకు అందవాల్సిన సేవల వివరాలను గణంకాలతో వివరించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం వ్యవస్థను వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డెలిగేట్స్ అభినందించారు. సదస్సులో జిల్లా నుంచి డి.యల్.పి.ఓ చంద్రశేఖర్, ఏలూరు ఎంపీడీఓ బండి ప్రణవి, భీమడోలు విస్తరణ అధికారి సుందరి, కొత్తపట్టిసం సర్పంచ్ యం.విజయదుర్గ, భీమడోలు సెక్రటరీ యన్. ఠాగూర్, గ్రామ సంరక్షణ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.