PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భీమ్లా నాయ‌క్ రివ్యూ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారీ అంచనాల మధ్య శుక్రవారం ‘భీమ్లా నాయక్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అహంకారి అయిన సైనికాధికారికి, ఆత్మ గౌరవం ఉన్న పోలీసు అధికారికి మధ్య జరిగిన స్టోరీనే ‘భీమ్లా నాయక్‌’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు,పాటలు, ట్రైలర్‌ సినిమాపై భారీ హైప్ క్రియేట్‌ చేశాయి. పలు చోట్ల ప్రిమియర్‌ షోస్‌ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘భీమ్లా నాయక్‌’గా పవన్‌ అదరగొట్టేశాడని, ఇప్పటి వరకు పవన్ కల్యాణ్‌ చేసిన సినిమాల్లో ది బెస్ట్‌ ఇదేనని, నటన అదిరిపోయిందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. త్రివ్రిమ్‌ డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే బాగుందని చెబుతున్నారు. ఫస్టాఫ్‌ బాగుందని, సెకండాఫ్‌ కాస్త నెమ్మదిగా సాగుతుందని కామెంట్‌ చేస్తున్నారు. క్లైమాక్స్‌ అంతగా బాలేదని కొంతమంది కామెంట్‌ చేస్తుండగా, చివరి 30 నిమిషాలు అదిరిపోయిందని మ‌రికొంద‌రు చెబుతున్నారు.

                                     

About Author