PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మొగుల‌య్యకు..రెండు ల‌క్షలు ఇచ్చిన ‘భీమ్లా నాయ‌క్ ’ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ భీమ్లానాయ‌క్ పాటలోని సాకీ ఆల‌పించిన కిన్నెర క‌ళాకారుడు మొగుల‌య్యకు జ‌నసేన అధ్యక్షడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు ల‌క్షల ఆర్థిక స‌హాయం ప్రక‌టించారు. మొగుల‌య్య తెలంగాణ‌లోని ఆమ్రాబాద్ రిజ‌ర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన‌వాడు. మొగుల‌య్య 12 మెట్ల కిన్నెర‌పై స్వరాలు ప‌లికిస్తూ గానం చేసే అరుదైన క‌ళాకారుడ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ ప‌త్రికా ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. వ‌ర్తమాన స‌మాజంలో క‌నుమ‌రుగు అవుతున్న ఇలాంటి క‌ళ‌లు, ముఖ్యంగా జాన‌ప‌ద క‌ళాకారుల‌ను యువ‌త‌కు ప‌రిచ‌యం చేయాల‌నే త‌ప‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉంద‌ని జ‌నసేన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ‘ప‌వ‌న్ క‌ళ్యాణ్ లెర్నింగ్ సెంట‌ర్ ఫ‌ర్ హ్యూమ‌న్ ఎక్సలెన్స్’ ద్వార మొగుల‌య్యకు ఆర్థిక స‌హాయం ప్రక‌టించ‌నున్నారు.

About Author