PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భీమ్లా నాయ‌క్ విడుద‌ల వాయిదా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమాను విడుద‌ల వాయిదా ప‌డింది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా.. విడుదల తేదీని ఫిబ్రవరి 25కి మార్చినట్లు తాజాగా వెల్లడించింది. సినిమా విడుదల వాయిదాపై గతంలోనూ వదంతులు రాగా.. వాటిని చిత్ర నిర్మాతలు తోసిపుచ్చారు. జనవరి 12నే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దీంతో సంక్రాంతి బరిలో పవన్‌ ఉంటారని అందరూ భావించారు. కానీ, ఆయన అభిమానులకు షాక్‌ ఇస్తూ చిత్రం విడుదలను వాయిదా వేశారు. ఈ సంక్రాంతికి పాన్‌ ఇండియా సినిమాలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు విడుదలవుతున్నాయి. దీంతో థియేటర్లకు సంబంధించి ఇబ్బందులు కలగకూడదని ‘భీమ్లా నాయక్‌’ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

                                  
     

About Author