PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భీమ్లానాయక్ మొగులయ్యకు కోటి రూపాయలు, ఇంటి స్థలం !

1 min read

పల్లెవెలుగువెబ్ : భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ పాడిని కిన్నెర మొగులయ్యకు ఇటీవల పద్మ పురస్కారంతో కేంద్రం ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం పొందిన మొగిలయ్యను తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనంగా సత్కరించారు. ఆయనకు హైదరాబాద్‌లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటి‌ని ఇవ్వనున్నట్లుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనని సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి.. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ.. కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు.

     

About Author