ఘనంగా భీరప్ప స్వామి దేవర పల్లకోత్సవం
1 min read
పల్లెవెలుగు , మంత్రాలయం: మండల పరిధిలోని చెట్నీహళ్లి గ్రామంలో వెలసిన శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవరను రెండో రోజు ఆలయ పూజార్లు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా పల్లకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున చెట్నీహళ్లి గ్రామానికి చెందిన అళ్లింగప్ప, పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన యాతగిరప్ప, ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన వన్నికెరప్ప స్వామి వార్ల కలసి మూడు పల్లకి లు రాత్రి తుంగభద్ర నది తీరాన కోలువై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుంగభద్ర నది నుంచి పల్లకిలు పారువేట ఉత్సవాలు నిర్వహించి గ్రామ పూర వీధుల్లో గుండా డోలు, సన్నాయి, మేళ తాళాలు, నృత్యాలు, ఆట పాటలతో దేవాలయం వరకు పల్లకోత్సవం ఘనంగా నిర్వహించారు. అలాగే కుంభోత్సవం నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. రాత్రి మలిగే పూజ అత్యంత వైభవంగా నిర్వహించారుహ దేవర కు వచ్చిన భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
