పార్కు నిర్మాణానికి భూమి పూజ
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కృషితో కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అనుమతి తో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి సహకారంతో రూ.40 లక్షలతో పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సోమవారం విజయ దశమి సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ కాటెపోగు చిన్నరాజు ఆధ్వర్యంలో పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మన్సూర్ , పగిడాల మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి , ఉమ్మడి జిల్లాల మైనార్టీ జోనల్ ఇంచార్జ్ అబూబకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణ అభివృద్ధే లక్ష్యంగా శాప్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కృషి ఎనలేనిదని కొనియాడారు.పట్టణాభివృద్ధి కోసం ఏదో విధంగా మంచి చేయాలని గొప్ప ఆలోచన కలిగిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అన్నారు. ఏబియం పాలెంలో రూ. 40 లక్షలతో పార్క్ నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. అదేవిధంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీ తో మాట్లాడి వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని అన్నారు. పట్టణంలో నిర్విరామంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. నందికొట్కూరు అభివృద్ధి టీడీపీ నాయకులకు కనబడదని ఎద్దేవాచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు జబ్బార్, కౌన్సిలర్లు అబ్దుల్ హమీద్, పి.చాంద్ బాషా, అబ్దుల్ రవూఫ్, మనపాడు అశోక్, షేక్ నాయబ్, లాలూ ప్రసాద్ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బొల్లెద్దుల రామకృష్ణ, వైసీపీ నాయకులు ఉస్మాన్ బేగ్, సప్లయర్ సత్యనారాయణ, రజిని కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఉపేంద్ర రెడ్డి, గోవింద్ రెడ్డి, డి రమేష్, ఆర్టీసీ బాబు, మార్కెట్ రాజు, ఉస్మాన్, బీసీ నాయకులు కాళ్లూరి శివప్రసాద్, పగిడాల సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న, కురువ శ్రీను, పి.రమేష్, బ్రహ్మయ్య ఆచారి, శాలి భాష, టి.అశోక్ తదీతరులు పాల్గొన్నారు.