టిటిడి పై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం.. టిడిపి నాయకులు ఫైర్…
1 min read
టిటిడి గోమరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయడం మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర
మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం ,న్యూస్ నేడు : టిటిడి గో మరణాల పై భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేయడం మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర ఉందని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాధవరం టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టిటిడి పై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని. విమర్శించారు. ఈ విధమైన చర్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో ఇదొకటి అన్నారు. అది నల్ల రాయి మీద చెప్పు విసిరితే ఏమవుతుంది అంటూ గతంలో వెంకటేశ్వర స్వామి పై అనేక విమర్శలు చేసిన ఈ కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారని అన్నారు. . కోటిమంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా ఈ వైసీపీ పెద్దమనిషి అసత్య ప్రచారాలు చేస్తూ టిడిపి ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. గోశాలలో 100 ఆవులు చనిపోయినాయంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని గోశాలలోని ఆవులు వృద్ధాప్యం వలన, డెలివరీ సమయంలో వ్యాధుల వలన, నెలకు సగటున 10 ఆవుల వరకు మృత్యువాత పడుతుంటాయని గత ఐదేళ్లుగా ఈ గణంకాలు చూస్తే స్పష్టమవుతోంది తెలిపారు. అసలు కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ లో చనిపోయినట్లు చూపించిన ఆవులు ఫోటోలు ఇక్కడివి కాదని ఎక్కడివో వాటిని తెచ్చి చూపించడం ఎంత మూర్ఖత్వం అని అన్నారు. టీటీడీ గోశాలలో 260 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తూ గోవుల సంరక్షణను సక్రమంగా చూసుకుంటూ ఉంటే టిటిడి పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అన్నారు. అసలు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సమయంలో ప్లాస్మా టీవీలకు కుంభకోణం,తాళిబొట్ల కుంభకోణం,టికెట్లు అమ్ముకోవడం డాలర్లు మాయం చేయడం వంటి దుష్ప్రచాలకు పాల్పడలేదా…కరోనా సమయంలో స్వామివారి ప్రసాదాలను కూడా దారి మళ్లించి అపచారాలకు పాల్పడిన చరిత్ర నీది కాదా కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి కొండపై అసత్య ప్రచారాన్ని చూపించి ఏడుకొండలను 5 కొండలు గా మార్చి కుట్ర చేసిందని తెలిపారు. టీటీడీ ను కూడా ప్రయివేట్ లిమిటెడ్ చర్యలకు పాల్పడింది నువ్వు కాదా..నువ్వు చేసిన తప్పుడు పనులకు విధుల నుంచి దూరమైన హరినాత్రుడు అనే వ్యక్తి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పైన తప్పుడు ప్రచారం చేస్తావా సిగ్గు చేటు అన్నారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.