శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ అభివృద్ధి పనులకు భూమి పూజ
1 min readరూ.1కోటి 25లక్షలతో దేవస్థాన పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు శ్రీకారం
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : నందవరం మండల పరిధిలో గురజాల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మిగనూరు శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి,ఎమ్మిగనూరు వైకాపా సమన్వయకర్త బుట్టా రేణుక నందవరం మండలం గురజాల గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్ నిర్మాణ పనులకు కోటి 25 లక్షలతో అభివృద్ధి పనులకు శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మరియు ఎమ్మిగనూరు వైకాపా సమన్వయకర్త బుట్టా రేణుక శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గుడి నూతన నిర్మాణం కోసం ఆలయ పూజారుల చేత శాస్త్రోత్తంగా వేదమంత్రాలు భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేసి ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ , సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు,నందవరం కోఆప్షన్ సభ్యులు, వైకాపా నాయకులు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు, పాల్గొన్నారు.