నేడే ఇండోర్ స్టేడియం పనులకు భూమి పూజ
1 min read– ఇండోర్ స్టేడియం స్థల పరిశీలన.. నెరవేరునున్నా క్రీడాకారుల చిరకాల వాంఛ..
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశిస్సులతో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ సందర్భంగా గురువారం ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్న ట్లు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి తెలిపారు . నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని జీవన్ జ్యోతి స్కూల్ ఎదురుగా ఇండోర్ స్టేడియం కొరకు కేటాయించిన స్థలాన్ని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , కమీషనర్ పి.కిషోర్, శాప్ జిల్లా కో-ఆర్డినేటర్ స్వామిదాసు రవికుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాల మద్దయ్య పరిశీలించారు .ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు చాంద్ భాష, హమీద్ మియ్య, అల్లురి క్రిష్ణ లు, షేక్ నాయబ్, కురువ శ్రీను పాల్గొన్నారు.