8ఏళ్ల వయసులోనే పర్వతాధిరోహణ బుడతడు…భువణ్! సీఎం జగన్ ప్రశంస
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: 8ఏళ్ల వయసులో భారతీయ బుడతడు గతనెల 18న యూరప్(రష్యా)లోని అత్యంత ఎతైన(5,642మీటర్లు) పర్వతం మౌంట్ ఎల్ర్బస్ శిఖరాన్ని అధిరోహించి యావత్ దేశాన్ని అబ్బుపర్చాడు. ఇంతకు ఆ బుడతడు ఎవరనుకుంటున్నారా…? మన తెలుగోడే.. సీనియర్ ఐఏఎస్ అధికారి. రాష్ట్రమైనార్టీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి గంధం చంద్రుడు తనయుడు భవణ్. పర్వత శిఖరాన్ని అధిరోహించిన గంధం భువన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రశంసించారు. అలాగే భువణ్ తంత్రి గంధం చంద్రుడును, కోచ్ శంకరయ్యలను సీఎం. జగన్ అభినందించారు. భువన్ విదేశీ పర్వతాన్ని ప్రతికూల వాతావరణంలోనూ సాహసోపేతంగా అధిరోహించి అందరిని అశ్చర్యపర్చాడు.