ముస్లిం మైనార్టీల పక్షపాతి…సీఎం జగన్
1 min read– బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయింపు.. అభినందనీయం
– డిప్యూటీ సీఎం అంజాద్బాష
పల్లెవెలుగు వెబ్, కడప : రాష్ట్ర బడ్జెట్లో ముస్లింల అభ్యన్నతికి ప్రత్యేక నిధులు కేటాయించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ముస్లిం మైనార్టీల పక్షపాతి అని మరోసారి రుజువు అయిందని డిప్యూటీ సీఎం అంజాద్ బాష పేర్కొన్నారు. రాష్ట్రంలో 9 శాతం ఉన్న మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం నవరత్నాల కింద అమలవుతున్న విద్యా, ఉపాధి, సామాజిక చేయూతకు సంబంధించిన పథకాలే కాకుండా వక్ఫ్ మరియు చర్చి ఆస్తుల పరిరక్షణ, నిర్మాణ నిర్వహణతోపాటు ఇమాములు మరియు మౌజన్లకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాన్ని నెలకు రూ. 5వేల నుంచి రూ.10వేలు మౌజన్లకు రూ.3వేల నుంచి రూ.5వేలు పెంచడం సంతోషించదగ్గ విషయమన్నారు. అదేవిధంగా పాస్టర్లకు నెలకు రూ.5వేల మంజూరు, పవిత్ర హజ్ మరియు జెరుసలెం యాత్రికులకు ప్రత్యేక రాయితీలు, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు , విద్యా సంస్థల నిర్మాణ, నిర్వహణ లాంటి అనేక కార్యక్రమాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.3,840,72 కోట్లు నిధులు కేటాయించడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల ప్రజల తరుపున డిప్యూటీసీఎం అంజాద్బాష ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పత్రికా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు.