పోలింగ్ రోజు సైకిల్ గుర్తు.. నేనే కనిపించాలి.. టి.జి భరత్
1 min readటి.జి వెంకటేష్ మైనారిటీ షాదీఖానా నుండి ప్రారంభమైన టి.జి భరత్ సైకిల్ యాత్ర
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రానున్న ఎన్నికల్లో పోలింగ్ రోజు ప్రజలకు సైకిల్ గుర్తు, తాను మాత్రమే కనిపించాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలో ఆయన రెండవ విడత సైకిల్ యాత్ర చేపట్టారు. ఉస్మానియా కాలేజీ సమీపంలోని టి.జి వెంకటేష్ మైనారిటీ షాదీఖానా వద్ద నుండి యాత్ర ప్రారంభించి గుమ్మజ్‌లో ముస్లీం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూల్లో తాను చేపట్టిన సైకిల్ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వస్తోందన్నారు. కర్నూల్లో ఎన్నో సమస్యలున్నాయన్నారు. త్రాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు, విద్యుత్ స్థంబాలు, విద్యుత్ షార్ట్ సర్య్కూట్, ట్రాఫిక్, నిరుద్యోగం సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ పదేళ్లలో నగరం ఎంతో వెనుకబడిపోయిందన్నారు. తాను గెలిచాక ఈ సమస్యలన్నీ క్రమ పద్దతిలో పరిష్కరిస్తానని ప్రజలకు భరోసా ఇస్తున్నట్లు చెప్పారు.
అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులే: ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సతమతమవుతున్నారని టి.జి భరత్ పేర్కొన్నారు. నిత్యవసర సరుకుల ధరలు తీవ్రంగా పెరిగాయన్నారు. ప్రజల ఆదాయం పెరగాల్సిందిపోయి ఖర్చులు విపరీతంగా పెరిగాయని ఆయన మండిపడ్డారు. ఉద్యోగాలు లేక యువత అయోమయంలో పడ్డారని.. తాను గెలిచాక నిరుద్యోగ సమస్యకు పరిశ్రమలు తెచ్చి పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇటీవలే జాబ్ మేళా నిర్వహించి 400 మంది యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించానని చెప్పారు. ఇక చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన మేనిఫెస్టో ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీంతో పాటు కర్నూలులో ఉన్న సమస్యల దృష్ట్యా ప్రజల కోసం తాను కూడా ఒక మేనిఫెస్టో తయారుచేస్తున్నట్లు టి.జి భరత్ తెలిపారు. ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని యాత్రలో ఆయన ప్రజలను కోరారు. సైకిల్ యాత్ర సాగిందిలా .. టి.జి వెంకటేష్ మైనారిటీ షాదీఖానా వద్ద నుండి ప్రారంభమై కె.ఎం హాస్పిటల్, పీలి మసీద్, గీతా మందిరం, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, కాళమ్మ గుడి, కుమ్మరిగేరి నాలుగు రస్తాలు, నిమిషాంబ గుడి, నూర్ అహ్మద్ హోటల్, గడ్డ యూనివర్సల్ స్కూల్, మేడం వారి సత్రం, బేకార్‌కట్ట, పెద్ద పడఖానా, బుధవారపేట బ్రిడ్జి, గుడ్ షప్పర్డ్ చర్చి, కనకదుర్గమ్మ ఆలయం, మహబూబ్ సుబానీ మసీద్,మెరీడియన్ ఫంక్షన్ హాల్, రాజ్ విహార్ బ్రిడ్జి మీదుగా మౌర్య ఇన్ చేరుకుంది.