PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోదీ కోట‌లో సైకిల్ స‌వారి..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఉత్తర ప్రదేశ్ జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. అధికారంలో ఉన్న బీజేపీని స్థానిక ఎన్నిక‌ల్లో ప్రజ‌లు తిర‌స్కరించారు. మోదీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలో కూడ బీజేపీ వెనుక‌బ‌డింది. ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప్రజా తిర‌స్కర‌ణ‌కు గురైంది. స్థానికంగా క‌రోన కేసులు తీవ్రంగా పెర‌గ‌డ‌టం, క‌రోన క‌ట్టడిలో విఫ‌లం కావ‌డంతో ప్రజ‌ల్లో వ్యతిరేక‌త నెల‌కొంది. ఫ‌లితంగా జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో రెండో స్థానానికి ప‌రిమిత‌మైంది. రాజ‌కీయ పార్టీల‌తో స‌మానంగా ఉత్తర‌ప్రదేశ్ జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో స్వతంత్ర అభ్యర్థులు గెల‌వ‌డం గ‌మ‌నార్హం.
ఉత్తర‌ప్రదేశ్ లో మొత్తం జిల్లా ప‌రిష‌త్ స్థానాలు 3050 కాగా.. ఇందులో అధికార బీజేపీ 599, ప్రతిప‌క్ష స‌మాజ్ వాదీ పార్టీ 790, బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ 354 , కాంగ్రెస్ 60 స్థానాల్లో గెలిచాయి. స్వతంత్రులు 1247 స్థానాల్లో గెలిచారు. ప్రధానిగా మోదీ ఎదురులేని మెజార్టీ సాధించిన త‌ర్వాత ఈ స్థాయిలో ఓడిపోవ‌డం గ‌ట్టి దెబ్బ అనుకోవ‌చ్చు. స్వయాన మోదీ సొంత నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిలో .. అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ మెజార్టీ స్థానాలు కైవ‌సం చేసుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఫ‌లితాలు బీజేపీకి నిరాశ‌నే మిగిల్చాయి. కానీ.. అధికారంలో ఉన్న ఉత్తర‌ప్రదేశ్ లో స్థానిక ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం కొంత ఆందోళ‌న క‌లిగించే అంశం అని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

About Author